కేసు నమోదు చేయాలి
కలెక్టర్ జోక్యం చేసుకోవాలి బాధిత కుటుంబానికి
భరోసా కల్పించాలి: ఎన్పీఆర్డీ రాష్ట్ర కమిటీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
యాదాద్రి-భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని యం.ఆత్మకూర్ మండలం తుక్కాపూర్ గ్రామంలో మూగ వికలాంగురాలిపై జరిగిన లైంగిక దాడి ఘటనపై సమగ్ర విచారణ జరపాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పీఆర్డీ) తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుంది. ఈ మేరకు బుధవారం ఎన్పీఆర్డీ రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు టి.వరమ్మ, రాష్ట్ర అధ్యక్షులు కె.వెంకట్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం.అడివయ్య, రాష్ట్ర కోశాధికారి ఆర్ వెంకటేష్, మహిళా విభాగం రాష్ట్ర కన్వీనర్ సి.సాయమ్మ ఒక ప్రకటన విడుదల చేశారు. మూగ, బహుళ వైకల్యం కలిగిన ఎస్సీ కులానికి చెందిన వికలాంగురాలిపై అదే గ్రామానికి చెందిన బీసీ సామాజిక వర్గానికి చెందిన యువకుడు ఒంటరిగా ఉన్నా యువతిపై లైంగిక దాడికి పాల్పడటాన్ని తీవ్రంగా ఖండించారు. వికలాంగురాలిపై జరిగిన ఘటనలో గ్రామానికి చెందిన కొంత మంది నాయకులు రాజీ కుదుర్చడం కోసం ప్రయత్నలు చేస్తున్నారని ఆరోపించారు. అత్యాచారం చేసిన యువకునిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు 2016 ఆర్పీడీ చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబం ఫిర్యాదు చేయడానికి ముందుకు రాకపోవడం అనేక అనుమానాలకు తావిస్తుందని తెలిపారు. ఘటనపై పోలీసులు సుమో టోగా కేసు నమోదు చేయాలనీ, జిల్లా కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకుని నిష్ప క్షపతంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గ్రామానికి చెందిన కొంత మంది రాజకీయ నాయకులు వారి పలుకుబడిని ఉపయోగించి బాధి తురాలికి అన్యాయం చేయడానికి ప్రయత్నం చేయడం సిగ్గు చేటని విమర్శిం చారు. ఘటన జరిగిన డీడబ్ల్యూఓ స్పందించకపోవడం సరైంది కాదని పేర్కొ న్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.






కామెంట్లు (0)