Magazines

న్యూజిలాండ్‌తో టెస్టుకు రిషభ్‌ పంత్‌ రెడీ!

3 గంటల క్రితం

Rishabh Pant is ready for the Test against New Zealand!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 07, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ – హైదరాబాద్ : టీమిండియా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ మళ్లీ జట్టులోకి వచ్చేందుకు సిద్ధమయ్యాడు. గాయం నుంచి కోలుకున్న అతడు నవంబర్‌ 19న వెల్లింగ్టన్‌లో న్యూజిలాండ్‌తో ప్రారంభమయ్యే తొలి టెస్టుకు అందుబాటులో ఉండే అవకాశాలున్నాయి. వచ్చే వారం న్యూజిలాండ్‌కు బయలుదేరనున్నాడు. అక్టోబర్‌ ఆరంభంలో ఇరానీ కప్‌ సందర్భంగా సైడ్‌ స్ట్రెయిన్‌ గాయానికి గురైన పంత్‌.. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో పునరావాసం పొందాడు. తాజాగా నెట్స్‌లో ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాటింగ్‌ చేస్తున్న వీడియోను పంచుకోవడంతో అతడి పునరాగమనంపై ఆశలు పెరిగాయి. గాయం కారణంగా న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్న ఇండియా-ఏ జట్టుకు పంత్‌ దూరమయ్యాడు. మరోవైపు జస్ప్రీత్‌ బుమ్రా, రవీంద్ర జడేజా, ప్రసిద్ధ్‌ కృష్ణ చివరి వార్మప్‌ మ్యాచ్‌ ద్వారా టెస్టు సిరీస్‌కు సిద్ధమవుతున్నారు. భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య రెండో టెస్టు నవంబర్‌ 27న క్రైస్ట్‌చర్చ్‌లో జరగనుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్