నవతెలంగాణ-హైదరాబాద్. గాజాలో భారీ తుఫాన్ అతలాకుతలం చేస్తోంది. భారీ వర్షాల కారణంగా గాజా స్ట్రిప్ అంతటా వేలాది గుడారాలు నీట మునిగిపోయాయి.అనేక ఆశ్రయ కేంద్రాలలో నీటిమట్టం 30-40 సెం.మీ (12-16 అంగుళాలు) మేర పెరిగింది. తీవ్రమైన గాలులు, వర్షాల కారణంగా మధ్య నుసైరాత్ ప్రాంతంలోని ఒక భవనం పాక్షికంగా కూలిపోవడంతో, అందులోని నివాసితులను రక్షక సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు సివిల్ డిఫెన్స్ పేర్కొంది. అలాగే, ఉత్తర గాజాలో భారీ వర్షాల వల్ల మరో భవనం గోడ కూలిపోవడంతో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారని 'వాఫా' వార్తా సంస్థ తెలిపింది.
గాజాలో భారీ తుఫాన్..నీట మునిగిన ఆశ్రయ కేంద్రాలు
50 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 07, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్లు (0)