Magazines

బెజవాడ లక్ష్మీనారాయణ చిత్రపటానికి డాక్టర్ దయానంద్ నివాళి 

18 నిమిషాల క్రితం

Bezawada Lakshminarayana
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 07, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-సత్తుపల్లి 

​సత్తుపల్లి మండలం గంగారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త బెజవాడ మనోజ్ కుమార్ తండ్రి లక్ష్మీనారాయణ ఇటీవల శివైక్యం చెందారు. శనివారం గంగారంలోని వారి గృహంలో జరిగిన లక్ష్మీనారాయణ దశదినకర్మ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ పాల్గొన్నారు. లక్ష్మీనారాయణ చిత్రపటంపై పూలు జల్లి  నివాళులర్పించారు.  ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి కాంగ్రెస్ నాయకులు చల్లగుళ్ల నరసింహారావు, మొహమ్మద్ కమల్ పాషా, గ్రామ ఉపసర్పంచ్ బెజవాడ రాధా శ్రీను, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కావేటి అప్పారావు, కోలగట్ల చెన్నకేశవరావు, కొండపల్లి మహేష్, తోట రాజేష్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్