నవతెలంగాణ-మల్హర్ రావు
తాడిచర్ల ఓసిపి బ్లాక్-1కు 500 మీటర్లు డేంజర్ జోన్లో ఉన్న ఇళ్ల సర్వే కొనసాగుతోంది.మండల తహసీల్దార్ రవికుమార్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఇళ్లను పరిశీలించి, వివరాలు సేకరిస్తున్నారు. తప్పిన ఇండ్లు, పిటిషన్లు ఇచ్చిన ఇండ్లు, పత్రాలు సమర్పించని ఇండ్లు, తగాదా ఉన్న ఇండ్లు పరిశీలిస్తున్నారు. దరఖాస్తులు పెట్టిన, అభ్యంతరాలు సమర్పించిన లబ్ధిదారులు అందుబాటులో ఉండి సర్వేలు చేయించుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఈ సర్వేలో డిప్యూటీ తహసీల్దార్ ఇమ్మాన్ పాషా, ఆర్‌ఐ నరేష్ కుమార్, జీపీఓలు ఆర్.శ్రీనివాస్, ఎస్.సంపత్, సిహెచ్.రాజు, ఎం.రాజేందర్, జి.నరేష్ పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)