• జిల్లా ట్రైనీ కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి
రైతుల పరస్పర అంగీకారంతో భూ సమస్యలు పరిష్కారం అవుతాయని జిల్లా ట్రైనీ కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు.మండలంలోని సరంపేట తండా లో శనివారం సర్వేనెంబర్ 330 లో గల భూమికి సంబంధించి వేళ్ల బాట సమస్యను రైతుల సమక్షంలో పరిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.భూమికి సంబంధించిన బాట మరియు ఇతర విషయాలు అధికారుల దృష్టికి తీసుకువస్తే రైతుల సమక్షంలో రైతులను ఒప్పించి సామరస్యంగా సమస్యలు పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందన్నారు.రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న 16 మంది రైతుల వేళ్లబాట సమస్యకు తెరపడడంతో రైతుల హర్షం వ్యక్తం చేశారు.ఈ విచారణలో చండూరు ఆర్డీవో శ్రీదేవి,తహసీల్దార్ జక్కర్తి శ్రీనివాసులు,సర్పంచ్ నక్క రాములమ్మ రవి,జిపిఓ,తదితరులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)