నవతెలంగాణ-హైదరాబాద్: టీజీపీఎస్సీ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత నెలకొంది. R&B AEE పరీక్ష, SSC JE పరీక్ష రెండూ నవంబర్ 6వ తేదీనే ఉన్నాయని, AEE పరీక్ష వాయిదా వేయాలని సివిల్ ఇంజనీరింగ్ చేసిన నిరుద్యోగులు డిమాండ్ చేశారు. వేసిందే తక్కువ పోస్టులు, అది కూడా వేరే పరీక్షతో క్లాష్ అవ్వడం అంటే తమకు తీరని అన్యాయం జరుగుతుందని నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 10 రోజులుగా పరీక్ష వాయిదా వేయాలని టీజీపీఎస్సీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని, పరీక్ష తేదీలు మార్చాలని ఆందోళనకు దిగిన నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
టీజీపీఎస్సీ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత..వీడియో
17 అక్టోబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 17, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్లు (0)