సంచలనం సృష్టించిన పాటలు..సంగీతం నచ్చలేదని నిర్మాత ఒక్క పైసా ఇవ్వలేదు : ఏఆర్ రెహమాన్

53 నిమిషాల క్రితం

AR Rehaman
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 29, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ 2011 నాటి మ్యూజికల్ హిట్ చిత్రం 'రాక్‌స్టార్'కు సంబంధించి ఓ ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడించారు. ఆ సినిమా కోసం తాను చేసిన పనికి నిర్మాత నుంచి ఒక్క రూపాయి కూడా పారితోషికం అందలేదని ఆయన తెలిపారు.

ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, నర్గీస్ ఫక్రీ జంటగా నటించిన చిత్రం ‘రాక్‌స్టార్’. ఈ సినిమాకు రెహమాన్ అందించిన సంగీతం అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే ఆ ప్రాజెక్ట్ సమయంలో ఎదురైన చేదు అనుభవాన్ని రెహమాన్ తాజాగా గుర్తుచేసుకున్నారు.

"రాక్‌స్టార్ చిత్రానికి సంబంధించి నిర్మాత నాకు పూర్తి ప్రాజెక్టుకు ఎలాంటి పారితోషికం ఇవ్వలేదు. 'నాకు మ్యూజిక్ నచ్చలేదు' అని నిర్మాత చెప్పారు. ఆ సమయంలో పని చేసిన ఇతర సంగీతకారులకు ఇచ్చే పారితోషికాలు, నా ప్రయాణ ఖర్చులు నేనే స్వయంగా భరించాను. ఈ సినిమా కోసం నాకు నయాపైసా కూడా రాలేదనే విషయాన్ని దర్శకుడు ఇంతియాజ్ అలీకి కూడా చెప్పలేదు" అని రెహమాన్ వివరించారు.

నిర్మాత అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ, రెహమాన్ రూపొందించిన ఆల్బమ్ ఆయన కెరీర్‌లోనే అత్యంత విశేషమైన గుర్తింపు పొందిన వాటిలో ఒకటిగా నిలిచింది. 'సద్దా హక్', 'నాదాన్ పరిందే', 'కున్ ఫయా కున్', 'ఫిర్ సే ఉద్ చలా' వంటి పాటలు చార్ట్‌బస్టర్‌లుగా నిలిచి, సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ ఆల్బమ్‌కు గాను రెహమాన్ ఉత్తమ సంగీత దర్శకుడిగా ఫిలింఫేర్ అవార్డును కూడా గెలుచుకున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్