నవతెలంగాణ-మల్హర్ రావు
జిల్లాలో ప్రాథమిక వ్యవ సాయ సహకార సంఘాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొత్తగా ఎనిమిది సహకార సంఘాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. దీంతో జిల్లా సహకార సంఘం జిల్లా అధికారి వాల్యానా యక్ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. జిల్లాలో ప్రస్తుతం ఉన్న మొత్తం 10 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలతో పాటు మరో 8 నూతన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను ఏర్పాటు చేయ డానికి చర్యలు తీసుకోనున్నారు.
నూతనంగా మహాముత్తారంలో మండలంలో బోర్లగూడెం, కాటారం మండలంలో దామెరకుంట, మల్హర్ రావు మండలంలో కొయ్యూరు, మొగుళ్లపల్లి మండలంలో మొట్లపల్లి, భూపాలపల్లి మండలంలో పంబాపూర్లో అలాగే పలిమెల, టేకుమట్లలో, గోరికొత్తపల్లి మండల కేంద్రాల్లో ఏర్పాటు చేయనున్నారు. నూతనంగా ఏర్పాటయ్యే మండలాల్లో డిసెంబర్ 18 వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు జిల్లా సహకార సంఘం అధికారి వాల్యానాయక్ తెలిపారు.
గడువులోగా అందిన అభ్యంతరాలు, సలహాలు సూచనలను పరిశీలించి, నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు చేపడుతామని తెలిపారు.
కొయ్యుర్ కేంద్రంగా సొసైటీ ఏర్పాటు
మండలంలోని కొయ్యుర్ కేంద్రంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఏర్పాటుకు జిల్లా సహకార సంఘం అధికారి వాల్య నాయక్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లుగా మండల తాడిచెర్ల పిఏసిఎస్ సిఈఓ కలికోట సంతోష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నూతన సంఘం పరిధిలో చిగురుపల్లి, దోమలమాదారం, కొండంపేట, వల్లేoకుంట, ఎడ్లపల్లి, రుద్రారం, మల్లంపల్లి, మోతుకుపల్లి ఉంటాయన్నారు. నోటిఫికేషన్ పై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 18 లోపు తెలపాలని కోరారు.






కామెంట్‌లు (0)