నవతెలం-గాణ హైదరాబాద్: దేశ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై ఉమ్మడి వ్యూహం రచించేందుకు ఇండియా కూటమి అగ్రనేతలు ఆదివారం చెన్నైలోని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా స్టాలిన్ నివాసానికి విచ్చేసిన కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి ఆయన స్వయంగా సాదర స్వాగతం పలికారు. మొదట చెన్నై ఎయిర్‌పోర్టు నుంచి ఇండియా కూటమి నేతలు రెండు ప్రత్యేక బస్సుల్లో స్టాలిన్ నివాసానికి తరలివచ్చారు. ఈ బృందంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, కేరళ సీఎం వీడీ సతీషన్‌లతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత మీనాక్షి నటరాజన్, తదితరులు ఉన్నారు.
సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తదితర అగ్రనేతల విజ్ఞప్తిపై ఎంకే స్టాలిన్ ఎలా రియాక్ట్ అవుతారు, ఏ నిర్ణయం తీసుకుంటారోనని ఇప్పుడు దేశ రాజకీయాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.






కామెంట్‌లు (0)