ప్రమాదపుటంచున ప్రయాణం.!

2 గంటల క్రితం

danger
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 29, 2026 | 1 నిమిషాల చదవడం

రోడ్లపై వరి కుప్పలతో ప్రయాణికులు పాట్లు

ప్రమాదాలు జరుగుతున్న ఎవరికి పట్టదా

నవతెలంగాణ-మల్హర్ రావు

మండలంలో వానాకాలం వరి పంటలు కోతికొచ్చాయి. ప్రస్తుతం అన్ని గ్రామాల్లో కోతలు మొదలైయ్యాయి. అయా గ్రామాల్లోని రైతులు వరి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అరబోసి తరువాత ధాన్యం అమ్ముకుంటారు. కానీ కొంతమంది రైతులు కొనుగోలు కేంద్రాల్లో పోయకుండా రోడ్లపై అరబోసి అడ్డుగా రాళ్లు పెడుతున్నారు. వాహనాలు ఎక్కువ శాతం తిరిగే తాడిచెర్ల, పెద్దతూండ్ల, కొయ్యుర్, రుద్రారం, ఎడ్లపల్లి తదితర ప్రాంతాల్లో ఏమైనా ప్రమాదాలు జరిగితే ప్రాణాలు పోయే లేదంటే గాయలపాలైయ్యే అవకాశాలున్నాయి.


ఇలా కాకుండా కొనుగోలు కేంద్రాల్లో లేదంటే కల్లాల్లో అరబోయాలని సూచిస్తున్నారు. దీనిపై పోలీసులు పట్టించుకుని రైతులకు అవగాన కల్పించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.


 మండలంలోఇదీ పరిస్థితి..

మండలానికి సంబంధించి 10,700 వేల ఎకరాలు ఎకరాలు వరిపంట సాగు చేశారు. దాదాపు అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు వద్ద రైతులు కొంతవరకు వరి ధాన్యం ఆరబెట్టుకుంటున్నారు. కానీ కొంతమంది రైతులు పరిస్థితులు అనుకూలించక రోడ్లపైన ఆరబోస్తున్నారు. దీనివల్ల ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రజలు ప్రశ్ని స్తున్నారు. గతంలో పెద్దతూoడ్ల-తాడిచెర్ల ప్రధాన రోడ్డుపై ధాన్యం ఆరబోసి కవర్ కప్పి ఉంచగా ఓ వ్యక్తి కనిపించక పోవడంతో ద్విచక్రవాహనంపై నుంచి అక్కడిక క్కడే మృతిచెందాడు. ఇదే కాక చిన్న, పెద్ద ప్రమాదాలు జరిగిన సంఘటనలున్నాయి. ఇప్పటికైనా పోలీసులు రైతులు రోడ్లపై వడ్లు ఆరబోయకుండా ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని పలువురు కోరుతున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్