నవతెలంగాణ - హైదరాబాద్ : అమెరికాలోని న్యూయార్క్ నగరం బ్రూక్లిన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 1930లో నిర్మించిన మూడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో ఎనిమిది మంది మృతిచెందగా, మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న సహాయక బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. సుమారు 250 మంది సిబ్బంది, డాగ్ స్క్వాడ్‌లతో శిథిలాల కింద చిక్కుకున్నవారి కోసం గాలింపు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు.
న్యూయార్క్‌లో కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. 8 మంది మృతి
12 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 13, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)