నవతెలంగాణ - హైదరాబాద్ : అమెరికాలోని మిసిసిప్పి నదిలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. నది ఒడ్డున నిలిపి ఉంచిన క్రూయిజ్ షిప్‌ను అదుపుతప్పిన ఓ ట్యాంకర్ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో క్రూయిజ్ షిప్ పూర్తిగా నదిలో మునిగిపోయినట్లు సమాచారం. ప్రమాదం నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు షిప్‌లోని ప్రయాణికులు లైఫ్ జాకెట్లు ధరించి నీటిలోకి దూకినట్లు తెలుస్తోంది. మరికొందరు షిప్‌తో పాటే నీటిలో చిక్కుకుపోయినట్లు సమాచారం. అయితే ఈ ఘటనలో ప్రాణనష్టంపై అధికారులు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మిసిసిప్పి నదిలో ఘోర ప్రమాదం..
4 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 14, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్లు (0)