నవతెలంగాణ - హైదరాబాద్: నగరంలోని ఉప్పల్ భగాయత్ హెచ్‌ఎండీఏ లేఅవుట్ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మహ్మద్ మునాజిర్ (34), మహ్మద్ సలావుద్దీన్ (35) ద్విచక్రవాహనంపై వెళ్తుండగా వాహనం అదుపుతప్పి డివైడర్‌పై ఉన్న విద్యుత్ స్తంభం దిమ్మెను బలంగా ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో మహ్మద్ సలావుద్దీన్ గుజరాత్ రాష్ట్రానికి చెందిన కార్మికుడిగా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలు, ఇతర వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఉప్పల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి
5 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 21, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)