నవతెలంగాణ - హైదరాబాద్ : అస్సాంలో కోల్‌కతా-సైరంగ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి గురైంది. కామ్‌రూప్ జిల్లాలోని డిగారు రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం ఉదయం 6.54 గంటలకు ఇంజిన్‌తో పాటు ఆరు కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. గువాహటికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రైలు గువాహటి స్టేషన్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న రైల్వే ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. రైలు పట్టాలు మారే సమయంలో సాంకేతిక సమస్య తలెత్తి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
అస్సాంలో పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్ రైలు
6 గంటల క్రితం

accident
వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 11, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)