- Advertisement -
నవతెలంగాణ – బాల్కొండ
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని శాంభవి హైస్కూల్ ఆధ్వర్యంలో బుధవారం పాఠశాల చైర్మన్ బొట్ల మధుసూదన్ రాజు క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన సంవత్సరంలో విద్యార్థులకు కొత్త ఆశలు, లక్ష్యాలు, విద్యలో పురోగతి మెరుగుపడే విధంగా కృషి చేస్తామని తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులందరూ బాగా చదివి అన్ని రంగాలలో ముందు ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ రవీణ్ ప్రసాద్, ప్రిన్సిపల్ ఇంద్రాణి, వైస్ ప్రిన్సిపల్ మంజుల, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



