వైరా ఏసీపీ సాదుల సారంగపాణి
నవతెలంగాణ – బోనకల్
పీడీఎస్ బియ్యాన్ని వికరిస్తే పీడీ యాక్ట్ కేసు నమోదు చేస్తామని, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇసుక రవాణా ప్రభుత్వ నిబంధనలకు లోబడి చేయాలని అలాకాకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తే ఇసుక ట్రాక్టర్ల పై, యజమానులపై, డ్రైవర్లపై చట్టపరమైన చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని వైరా ఏసిపి కాదురా సారంగపాణి హెచ్చరించారు. తెలిపారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం పరిధిలోనే బోనకల్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన హెచ్ పి పెట్రోల్ బంక వద్ద శుక్రవారం నూతనంగా ఏర్పాటు చేసిన ఇసుక అక్రమ రవాణా పిడిఎస్ బియ్యం చెక్ పోస్ట్ ను ఆయన పరిశీలించారు. చెక్ పోస్ట్ వద్ద ఏర్పాటు చేయవలసిన మౌలిక వసతులు తీసుకోవలసిన జాగ్రత్తలను ఆయన వివరించారు.
అనంతరం ఆంధ్ర తెలంగాణ సరిహద్దు వద్ద ఆంధ్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ న కూడా ఆయన సందర్శించారు అయితే ఆ సమయంలో ఆంధ్ర ప్రాంత సరిహద్దు చెక్ పోస్ట్ లో ఆంధ్ర ప్రాంత పోలీసులు చెక్ పోస్ట్ మూసివేసే ఒక్కరు కూడా లేకపోవడం విశేషం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర ప్రాంతం నుంచి బోనకల్ మీదుగా తెలంగాణ ప్రాంతంలోకి పెద్ద ఎత్తున అక్రమ ఇసుక రవాణా జరుగుతుందని దీనిని పూర్తిగా అరికట్టే ఎందుకే ఈ చెక్ పోస్ట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ చెక్ పోస్ట్ ను పోలీసులు 24 గంటల పాటు సమర్థవంతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. ఆంధ్ర ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున కొంతమంది తెలంగాణ ప్రాంతంలోకి వచ్చి రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. దానిని కూడా పూర్తిగా నిరోధించనున్నట్లు ఆయన తెలిపారు.
రేషన్ బియ్యాన్ని ఎవరు అమ్మ రాదు కొనరాదు అని ఆయన సూచించారు. రాష్ డ్రైవింగ్ చేసిన, త్రిబుల్ రైడింగ్ డ్రైవింగ్ చేసిన, లైసెన్స్, ఆర్ సి, హెల్మెట్ లేకుండా రోడ్డుపై వాహనాలు నడిపిన అలాంటి వారిపై చట్టపరమైన కట్టిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైరా సబ్ డివిజన్ పరిధిలోని గంజాయి తాగిన, అమ్మకాలు జరిపిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్థానికులు సమాచారం ఉంటే తమకు వెంటనే అందించాలని కోరారు.ఇసుక అక్రమ రవాణా జరిగే సమాచారాన్ని ప్రజలు ఇస్తే సమాచారం ఇచ్చిన వారికి తగిన పారితోషం అందజేస్తామని తెలిపారు.
అయితే ముందుగా ఇసుక రవాణా చేసే వారితో అవగాహన సమావేశం ఏర్పాటు చేసి వారికి తగిన సూచనలు ఇస్తామని తెలిపారు. ఆ తర్వాత ఇసుక అక్రమ రవాణా జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆంధ్ర ప్రాంతం వారు చెక్ పోస్ట్ వద్ద నిర్మించిన విధంగా తెలంగాణ సరిహద్దు ప్రాంతంలోనూ గదిని నిర్మిస్తామని తెలిపారు. ఇందుకు అవసరమైన అని చర్యలు తీసుకోవాలని ఎస్సై పొదిలి వెంకన్నకు సూచించారు. ఆయన వెంట మధిర రూరల్ సీఐ దొంగరి మధు, ఎస్సై పొదిలి వెంకన్న ఉన్నారు.



