Thursday, June 4, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇజ్రాయిల్, లెబ‌నాన్‌ల మ‌ధ్య సీజ్ ఫైర్

ఇజ్రాయిల్, లెబ‌నాన్‌ల మ‌ధ్య సీజ్ ఫైర్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఇజ్రాయిల్, లెబ‌నాన్‌ల మ‌ధ్య కాల్పుల విర‌మ‌ణ ఒప్పందం కుదిరింది. దీంతో బుధవారం అమెరికా మధ్యవర్తిత్వంతో జరిగిన తాజా చర్చల అనంతరం సంయుక్త ప్రకటన వెలువ‌డిన‌ట్లు అంత‌ర్జాతీయ మీడియా పేర్కొన్నాయి. ఈ సీజ్ పైర్‌తో రెండు దేశాల మ‌ధ్య ఎలాంటి దాడుల‌కు ఆస్కారం లేద‌ని పేర్కొన్నారు. కాగా, అమెరికా-ఇరాన్ శాంతి చ‌ర్చ‌ల వేళ ఇజ్రాయిల్ లెబ‌నాల్ భూభాగాల‌పై వైమానిక దాడుల‌కు తెగ‌బ‌డింది. దీంతో ఈ దాడుల‌ను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. లెబ‌నాన్‌పై దాడులు ఆపే వ‌ర‌కు ఎలాంటి చ‌ర్చ‌లు సాగించేది లేద‌ని స్ప‌ష్టం చేసింది. దీంతో త‌క్ష‌ణ‌మే ఇజ్రాయిల్ ప్ర‌ధాని నెత‌న్యాహూతో ట్రంప్ ఫోన్‌లో మాట్లాడారు. వెంట‌నే దాడుల‌ను ఆపాల‌ని, పిచ్చొడి అంటూ చివాట్లు పెట్టిన‌ట్లు అంత‌ర్జాతీయ మీడియా క‌థ‌నాలు వెలువ‌రించాయి. తాజా కాల్పుల విర‌మ‌ణ‌తో అమెరికా-ఇరాన్ శాంతి చ‌ర్చ‌లు ప్రారంభంకానున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -