Wednesday, March 11, 2026
E-PAPER
Homeకరీంనగర్మార్చి 15న హమాలి మహాగర్జనను జయప్రదం చేయండి

మార్చి 15న హమాలి మహాగర్జనను జయప్రదం చేయండి

- Advertisement -

నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
రాష్ట్రంలో 10 లక్షల మందికి పైగా హమాలీ కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతున్నారని మార్చి 15 నా హమాలీ మహాగర్జన హనుమకొండలో ఏర్పాటు చేయడం జరిగిందని హమాలీ కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర హమాలీ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి అన్నాడి వెంకట్ రెడ్డి అన్నారు సిరిసిల్లలోని ఆయన మాట్లాడుతూగత ప్రభుత్వం హమాలీ కార్మిక సంక్షేమాన్ని పట్టించుకోలేదని పనికి తగిన వేతనం అమలు కాలేదని ప్రస్తుత ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేస్తుందనే ఆత్మవిశ్వాసంతో హమాలీ కార్మికులు ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

మన యూనియన్ నిర్మాణాన్ని బలోపేతం చేసుకోవడానికి మన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ హమాలి కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయడానికి  మార్చి15 న నిర్వహించబోయే హమాలీ మహా గర్జన ను హనుమకొండ, వరంగల్ పట్టణంలో నిర్వహించబోయే సభను హమాలి కార్మికులు హాజరై విజయవంతం చేయాలని కోరుతున్నాం. సమావేశంలోహమాలీ కార్మిక సంఘం పెద్దపెల్లి జిల్లా బాధ్యులు జంగా సంపత్ యాదవ్, కామ భూమయ్య, కొమ్ము మధుకర్ ,ఎడ్ల విశాన్ , నగునూరి భాను,కులిపురం రమేష్ , గడ్డి దేవయ్య , హమాలీ కార్మికులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -