డీవైఎఫ్‌ఐ, నిరుద్యోగ జేఏసీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఉద్యోగాల సాధన కోసం నేడు చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు డీవైఎఫ్‌ఐ, నిరుద్యోగ జేఏసీ తెలిపింది. బుధవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో చలో అసెంబ్లీ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను అవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ ఆర్.ఎల్.మూర్తి, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ వెంకటేశ్, కోట రమేష్, ఉపాధ్యక్షుడు జావీద్, కిరణ్, నాయకులు రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలకోసం నోటిఫికెషన్లు విడుదల చేసి ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న యూత్ డిక్లరేషన్‌లో భాగంగా రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు జాబ్ క్యాలండర్, నిరుద్యోగ భృతి, యూత్ కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హమీలు అమలు చేయడం లేదని తెలిపారు.
నిరుద్యోగ యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేంతవరకు ప్రతి నిరుద్యోగికి రూ.4వేల నిరుద్యోగ భృతికి నిధులు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. బడ్జెట్‌లో నిరుద్యోగ భృతి పదమే లేదని చెప్పారు. గత బడ్జెట్లో ప్రకటించిన జాబ్ క్యాలండర్ గురించి ప్రస్తావించకపోవడమే గాక, ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు వేయకుండా నిరుద్యోగ యువతను మోసం చేస్తుందన్నారు. ప్రతి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం మాట తప్పిందని విమర్శించారు. స్వయం ఉపాధి రుణాలకోసం రాజీవ్ యువ వికాసం పథకాన్ని అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందన్నారు. యూత్ డిక్లరేషన్ హామీలను అమలు చేయాలని నేటి అసెంబ్లీ ముట్టడికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువత పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఉద్యోగాల కోసం నేడు చలో అసెంబ్లీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



