Thursday, March 26, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంలోకసాని పద్మారెడ్డికి ఛాంపియన్‌ ఫార్మర్‌ అవార్డు

లోకసాని పద్మారెడ్డికి ఛాంపియన్‌ ఫార్మర్‌ అవార్డు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌
నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం పోలేపల్లి గ్రామ రైతు లోకసాని పద్మారెడ్డికి జాతీయస్థాయి ఫార్మర్‌ అవార్డు లభించింది. ఈనెల 24, 25 తేదీల్లో ఘజియాబాద్‌లో నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఆర్గానిక్‌ అండ్‌ నాచురల్‌ ఫార్మింగ్‌ సెంటర్లో జరిగిన రెండు రోజుల సెమినార్‌, ఎగ్జిబిషన్‌లో కేంద్ర ప్రభుత్వం ఆయనకు చాంపియన్‌ ఫార్మర్‌ అవార్డును ప్రకటించింది. పోలేపల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో 12 ఎకరాల విస్తీర్ణంలో కుంకుడు సాగు చేయడం ద్వారా లోకసాని పద్మారెడ్డికి దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది.

ఆర్గానిక్‌, న్యాచురల్‌ ఫామింగ్‌పై సెమినార్‌లో ఆయన మాస్టర్‌ ట్రైనర్‌గా వ్యవహరించారు. మొదటి నుంచీ రసాయనాలు, పురుగుమందులు వినియోగించకుండా బత్తాయి, జామ, కుంకుడు, ఉసిరి, సీతాఫలం, కొబ్బరి తోటలను సాగు చేస్తున్నారు. ఆర్గానిక్‌ ఫార్మింగ్‌లో లోకసాని పద్మారెడ్డి చేస్తున్న కృషిని గుర్తించి కేంద్ర వ్యవసాయ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఆర్గానిక్‌, నేచురల్‌ ఫార్మింగ్‌ రీసర్చ్‌ సెంటర్‌ ఆయనకు జాతీయస్థాయిలో ఛాంపియన్‌ ఫార్మర్‌ అవార్డును ప్రకటించింది. ఇప్పటికే లోకసాని పద్మారెడ్డికి మిలియనీర్‌ ఫార్మర్‌, వనమాలి అవార్డులు లభించిన విషయం విదితమే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -