- Advertisement -
క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి
నవతెలంగాణ-హైదరాబాద్ : సీఎం కప్ ఓ నిరంతర ప్రక్రియ, గ్రామీణ క్రీడాకారులను గుర్తించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించేలా ప్రోత్సహిస్తామని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం ఎల్బీ స్టేడియంలో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం కప్ రాష్ట్ర స్థాయి పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. ఆదిలాబాద్ ఓవరాల్ చాంపియన్‌గా నిలువగా, రంగారెడ్డి ద్వితీయ స్థానంలో, కరీంనగర్ తృతీయ స్థానంలో నిలిచాయి. స్పోర్ట్స్ చైర్మన్ శివసేనారెడ్డి, క్రీడల సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి, సైనా నెహ్వాల్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
- Advertisement -



