నవతెలంగాణ-హైదరాబాద్: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ గురువారం నుంచి దేశ వ్యాప్తంగా పలుచోట్ల ఆందోళనలు చేపట్టనున్నట్లు బుధవారం ప్రకటించింది. తొలుత గురువారం పుణె నగరంతో ప్రారంభించి లక్‌నవూ, అమృత్‌సర్, బెంగళూరు, జైపూర్, హైదరాబాద్‌లలో ఆందోళనలు నిర్వహించనున్నట్లు తెలిపింది. పోటీ పరీక్షల నిర్వహణలో వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ ఈ నెల 13వ తేదీకల్లా కేంద్రమంత్రి రాజీనామా చేయాలని కోరింది.
లేని పక్షంలో ఈ నెల 20వ తేదీ నుంచి ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరవధిక ధర్నా చేపట్టనున్నట్లు హెచ్చరించింది. విద్యా వ్యవస్థను కాపాడుకొనేందుకు జరిపే ఈ పోరాటంలో దేశ వ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చింది. కాగా పర్యావరణవేత్త సోనమ్ వాన్‌చుక్ పుణెలో జరిపే నిరసనలో పాల్గొంటున్నట్లు సీజేపీ ఫౌండర్ అభిజీత్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.



