Thursday, October 9, 2025
E-PAPER
Homeకరీంనగర్కార్డు పట్టుకొని రండి చర్చకు సిద్ధం..

కార్డు పట్టుకొని రండి చర్చకు సిద్ధం..

- Advertisement -

పదేండ్లు ప్రజలను దోచుకున్నోళ్లే ధోకా కార్డు రిలీజీ చేయడం విడ్డురం
కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ప్రవీణ్..
నవతెలంగాణ – తంగళ్ళపల్లి

పదేండ్లు ప్రజలను దోచుకున్నోళ్లే ధోకా కార్డు రిలీజీ చేయడం విడ్డురం గా ఉందని,కార్డు పట్టుకొని రండి చర్చకు సిద్ధం అని కాంగ్రెస్ మండల అధ్యక్షులు జలగం ప్రవీణ్ కుమార్ సవాల్ విసిరారు.ప్రజలకు అమలు కానీ హామీలిచ్చి మోసం చేసింది బిఆర్ఎస్ పార్టీ అని, ఫామ్ హౌజ్ లు కట్టుకొని పడుకున్నరు తప్ప ప్రజలకు ఏం జేయ్యలేదు జలగం ప్రవీణ్ కుమార్ విలేకరుల సమావేశంలో ఆరోపించారు. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ ధోక కార్డు రిలీజ్ చేసి మాట్లాడారు.సిరిసిల్లను వేదికగా చేసుకొని తెలంగాణ వ్యాప్తంగా అవినీతికి ఆజ్యం పోసింది కేటీఆర్ అని అన్నారు.

ప్రజా సంక్షేమమే ద్యేయంగా ప్రజా పాలనా సాగిస్తుంటే కండ్లు మండుతున్నాయని ఎదవ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతల అసత్యపు ఆరోపణలు మానుకోవాలని హితవు  పలికారు.గత మీ పాలనలో చేసిన తప్పులను కప్పిపుచ్చుకోడానికే అసత్య ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అన్నారు.ప్రజలను ఆరిగోస పెట్టి ఇబ్బందులకు గురి చేసింది మీరు కాదా? అని ప్రశ్నించారు.హామీ ఇచ్చిన ప్రకారం..ఆరు గ్యారంటీలలో నాలుగు హామీలను అమలు చేశామని ధీమా వ్యక్తం చేశారు.బీసీ రిజర్వేషన్ లపై చిత్తశుద్ధి తో పని చేస్తుంటే బీ ఆర్ ఎస్ నేతల కండ్లు మండుతున్నాయన్నారు. రూ.3 వేల కోట్ల విలువైన ఇసుకను సిరిసిల్ల నుండి తరలించి కోట్లు సంపాదించినా మీరు ధోక కార్డులు రిలీజ్ చేయడం సిగ్గుచేటన్నారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల నరసింహ గౌడ్, జిల్లా కార్యదర్శి లింగాల భూపతి, సత్తు శ్రీనివాసరెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ డైరెక్టర్లు ఇట్టేటి శ్రీనివాస్ రెడ్డి, ఆరేపెల్లి బాలు మునిగేల రాజు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -