Wednesday, May 27, 2026
E-PAPER
Homeతాజా వార్తలుగాంధీ భవన్‌లో కాంగ్రెస్‌ నేతల ఘర్షణ

గాంధీ భవన్‌లో కాంగ్రెస్‌ నేతల ఘర్షణ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ నేతల సమావేశంలో రసాభాస చోటు చేసుకుంది. గాంధీ భవన్‌లో మంత్రులు అజహరుద్దీన్‌, పొన్నం ప్రభాకర్‌ ముందే కాంగ్రెస్‌ నేతలు చొక్కాలు పట్టుకొని ఘర్షణ పడ్డారు. అజహరుద్దీన్‌ పక్కన కూర్చునే అంశంలో ఫిరోజ్‌ఖాన్‌, ఉస్మాన్‌ అల్‌ హజ్రీ మధ్య ఈ గొడవ జరిగింది. ఉస్మాన్‌ అల్‌ హజ్రీ తోసేయడంతో ఫిరోజ్‌ఖాన్‌ కిందపడ్డారు. వీహెచ్‌ను కూడా తోసేందుకు యత్నించగా నేతలు అడ్డుకున్నారు. ఈక్రమంలో అజహరుద్దీన్‌ సమావేశం నుంచి వెళ్లిపోయారు. సమావేశం ముగిసినట్లు పొన్నం ప్రభాకర్‌ ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -