– విద్యార్థులపై లాఠీచార్జ్‌ను ఖండించిన నేతలు..
నవతెలంగాణ-కుభీర్
నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి నిరసనగా దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ధర్నా చేస్తున్న విద్యార్థులపై పోలీసులు అమానుషంగా లాఠీచార్జ్ చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది. కాంగ్రెస్ అధిష్టానం, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఆదేశాల మేరకు గురువారం మండల కేంద్రమైన కుభీర్ వివేకానంద విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. నీట్ పరీక్ష అక్రమాలపై విద్యార్థులు చేస్తున్న న్యాయమైన పోరాటానికి రాహుల్ గాంధీ మద్దతు తెలపడంతో భయపడిన కేంద్ర ప్రభుత్వం, పోలీసులను ప్రయోగించి లాఠీచార్జ్ చేయించడం అత్యంత దారుణమన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న కేంద్ర ప్రభుత్వ వైఖరి నశించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహిపాల్ రెడ్డి నాయకులు విజయ్ కుమార్,మల్లేష్, శ్రీరాముల రాజు సూది రాజన్న,సంతోష్, వైస్ చెర్మన్ హైమద్,సాయినాథ్, వివిధ గ్రామాల సర్పంచులు మండల నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
నీట్ అక్రమాలపై కుభీర్‌లో కాంగ్రెస్ నాయకులు రాస్తారోకో
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



