Thursday, July 23, 2026
E-PAPER
Homeజిల్లాలుమిడ్జిల్ లో ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం 

మిడ్జిల్ లో ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం 

- Advertisement -

నవతెలంగాణ-మిడ్జిల్
నీట్ పేపర్ లీక్ పై కేంద్రమంత్రి విద్యాశాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని శాంతియుత ధర్నా చేస్తున్న విద్యార్థులపై పోలీసులు చేసిన దాడి దారుణమని మండల కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. మరోవైపు దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి వద్ద ధర్నా చేపట్టిన పార్లమెంట్ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీపై బీజేపీ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇందులో భాగంగా గురువారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహమ్మద్ గౌస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం జడ్చర్ల కల్వకుర్తి ప్రధాన రహదారిపై ప్రధానమంత్రి నరేందర్ మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో  మాజీ జెడ్పిటిసి సభ్యులు మహమ్మద్ గౌస్ రబ్బాని, జడ్చర్ల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ జ్యోతి అల్వాల్ రెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు ఎడ్ల శంకర్ ముదిరాజ్, వివిధ గ్రామాల సర్పంచులు నాగరాజు గౌడు, శ్రీశైలం యాదవ్, ధర్మానాయక్, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు చెన్నయ్య, ఎస్టి సెల్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ నాయక్, మండల నాయకులు మల్లికార్జున రెడ్డి, సాయిలు, వెంకటేష్ గౌడ్, శివ ప్రసాద్, కృష్ణ యాదవ్, బంగారు, రమేష్ పంతులు, నరసింహులు , మహమ్మద్ బాబా, పసుల శివ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -