Wednesday, March 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు శిక్షణకు ఏర్పాట్లు పరిశీలన

స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు శిక్షణకు ఏర్పాట్లు పరిశీలన

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించనున్న 99 రోజుల కార్యక్రమానికి సంబంధించి ఈ నెల 12వ తేదీన కళాభారతి లో జరగనున్న శిక్షణా కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశాల మేరకు బుధవారం అదనపు కలెక్టర్లు విక్టర్, మధుమోహన్ కార్యక్రమం నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు కొత్తగా ఎన్నికైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

సర్పంచులు, మున్సిపల్ వార్డు సభ్యులు, చైర్మన్లు, మేయర్లు పాల్గొనే ఈ శిక్షణ కార్యక్రమం గురువారం ఉదయం 10.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, 99 రోజుల కార్యాచరణ ప్రణాళికకు సంబంధించిన అంశాలపై సమగ్ర అవగాహన కల్పించనున్నట్లు అదనపు కలెక్టర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వీణ, డీపీఓ మురళీతో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -