Thursday, March 26, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమార్చి చివరినాటికి 1.12లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తి

మార్చి చివరినాటికి 1.12లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తి

- Advertisement -

– మేలో రెండో దశ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు : రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

మార్చి నెలాఖరునాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్షా 12వేల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తికానుందనీ, జూన్‌ నాటికి మరో లక్ష ఇండ్ల పనులు పూర్తవుతాయని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి చెప్పారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీ సభ్యులు కె. వెంకట రమణా రెడ్డి, రామారావు పవార్‌, పాయల్‌ శంకర్‌, బీఆర్‌ఎస్‌ సభ్యులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, పల్లా రాజేశ్వర రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, కాంగ్రెస్‌ సభ్యులు యశస్వినీ రెడ్డి, వంశీకృష్ణ, రాజ్‌ఠాకూర్‌ తదితరులు డబుల్‌ బెడ్‌రూం, ఇందిరమ్మ ఇండ్లపై అడిగిన ప్రశ్నలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సమాధానమిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణాలను పూర్తిచేసి నిజమైన లబ్ధిదారులకు అందజేస్తామని తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 12వేలకు పైచిలుకు డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు ఖాళీగా ఉన్నాయనీ, అవి నగర శివార్లలో ఉండటం కారణంగా లబ్ధిదారులు ఆసక్తి చూపటంలేదని చెప్పారు. వాటిని సమీపంలోని పేదలకు కేటాయిస్తామని చెప్పారు. డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల కాలనీల్లో ఉన్న దుకాణాల ద్వారా వచ్చే ఆదాయాన్ని అక్కడ మెయింటనెన్స్‌కే ఖర్చు చేస్తామని తెలిపారు. మధ్యలో నిలిచిపోయిన డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి పునరుద్ఘాటించారు. పాత ఏజెన్సీలు పాత రేట్ల ప్రకారం ముందుకొస్తే నిధులు విడుదలచేస్తామన్నారు. లేనిపక్షంలో లబ్ధిదారులను ఎంపికచేసి వారికే బ్యాలెన్స్‌ నిధులు ఇస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -