- Advertisement -
– విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సర్పంచ్ నాగమణి
నవతెలంగాణ – అశ్వారావుపేట
వంటలు శుచి, శుభ్రతతో చేయడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన భోజనం వడ్డించాలని నారంవారిగూడెం సర్పంచ్ మనుగొండ నాగమణి ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్‌కు సూచించారు. బుధవారం ఆమె స్థానిక పీఎం శ్రీ–ఎంపీయూపీఎస్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించిన సర్పంచ్ నాగమణి, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం పాఠశాలలో భోజన ఏర్పాట్లు, పరిశుభ్రతపై ప్రధానోపాధ్యాయుడికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నార్లపాటి జగదీష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
- Advertisement -


