Thursday, June 11, 2026
E-PAPER
Homeక్రైమ్దారుణం..చిన్నారిని పీక్కుతిన్న వీధికుక్కలు

దారుణం..చిన్నారిని పీక్కుతిన్న వీధికుక్కలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో దారుణం జరిగింది. నవజాత శిశువును వీధికుక్కలు పీక్కుతిన్న విషాదకర సంఘటన చోటు చేసుకుంది. జడ్చర్ల పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలోని గుట్ట పక్కన గుర్తు తెలియని వ్యక్తులు నవజాత శిశువును పడవేసి వెళ్లిపోయారు. అక్కడే ఉన్న వీధికుక్కలు ఆ శిశువును కొరికి తినేశాయి. శిశువు శరీర భాగాలను గుర్తించిన స్థానికులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఏం జరిగింది, నవజాత శిశువును గుట్ట పక్కన పడేసింది ఎవరు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -