- Advertisement -
- – అలియన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఫార్మేటివ్ నోట్ బుక్స్ పంపిణీ
- నవతెలంగాణ- దుబ్బాక
- జీవితంలో ఉన్నత శిఖరాలు చేరుకునేందుకు నేటినుండే అడుగులు వేయాలని, అందుకు ప్రతి విద్యార్థికి నిత్య సాధన తప్పనిసరి అని ఎంఈఓ దోమకొండ అంజయ్య అన్నారు. దాతలు, సేవా దృక్పథం ఉన్నవారు ప్రభుత్వ పాఠశాలలకు చేయుతనందిస్తే.. అది ఆ విద్యార్థుల మనో ఫలకాలపై చిరస్థాయిలో గుర్తుండిపోతుందని స్పష్టం చేశారు. గురువారం అక్బరుపేట భూంపల్లి మండల పరిధిలోని రామేశ్వరంపల్లి జడ్పీహెచ్ఎస్ లో “అసోసియేషన్ ఆఫ్ అలియన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సిద్దిపేట మిత్ర 162 (ఎస్)” ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు ‘ ఫార్మేటివ్ నోట్ బుక్స్ ను, అలాగే రామేశ్వరంపల్లి గ్రామానికి చెందిన పల్లె అనిల్ అనే యువకుడు టై, బెల్టులను అందించారు.
- వీటిని అలియన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ గందె ఈశ్వర్ చరణ్, మిత్ర క్లబ్ అధ్యక్షులు గంగిశెట్టి కైలాసం, చిట్టాపూర్ కాంప్లెక్స్ హెచ్ఎం ప్రభాకర్ రెడ్డి, జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం ఎన్. శ్రీనివాస్, తో కలిసి ఎంఈఓ డీ .అంజయ్య పంపిణీ చేశారు. అనంతరం హెచ్ఎం శ్రీనివాస్ విజ్ఞప్తి మేరకు పాఠశాల విద్యార్థులకు నాలుగు సైకిళ్లను త్వరలోనే అందిస్తామని అలియన్స్ జిల్లా గవర్నర్ ఈశ్వర చరణ్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆలియన్స్, మిత్ర క్లబ్ వారిని, పల్లె అనిల్ ను ఎంఈఓ అంజయ్య అభినందించారు. అనంతరం వారిని చేనేత శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అలియన్స్, మిత్ర క్లబ్ ఇంటర్నేషనల్ కమిటీ సభ్యులు ఆత్మ రాములు, పీడీజీ అంతయ్య, కార్యదర్శి వీరమలు సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి నల్ల ధనుంజయ్, పాఠశాల ఉపాధ్యాయ బృందం, గ్రామస్తులు పాల్గొన్నారు.
- Advertisement -