Tuesday, May 5, 2026
E-PAPER
Homeఆటలుటాస్ గెలిచిన డీసీ

టాస్ గెలిచిన డీసీ

- Advertisement -

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ బిగ్ మ్యాచ్‌కు సిద్ధమయ్యాయి. సొంతగడ్డపై టాస్ గెలిచిన అక్షర్ పటేల్ బ్యాటింగ్ తీసుకున్నాడు. ప్రస్తుతం ఆరో స్థానంలోని సీఎస్కే, ఏడో స్థానంలో కొనసాగుతున్న ఢిల్లీకి ఈ మ్యాచ్ చాలా కీలకం. గాయంతో రెండు మ్యాచ్‌లకు దూరమైన ఎంగిడి ఆడుతున్నాడు. జేమీసన్ స్థానంలో అతడు జట్టులోకి వచ్చాడని అక్షర్ పటేల్ తెలిపాడు. చెన్నై సైతం రెండు మార్పులు చేసింది. అకీల్ హొసేన్, గుర్జప్నీత్‌లు తుది జట్టులోకి వచ్చారు. గత మ్యాచ్‌లో అర్ధ శతకంతో మెరిసిన కార్తిక్ శర్మ.. ఢిల్లీపైనా చెలరేగాలని భావిస్తున్నాడు. రికార్డులు గమనిస్తే.. ఇరుజట్లు 32 సార్లు తలపడగా చెన్నై 20 మ్యాచుల్లో, ఢిల్లీ పన్నెండింటా గెలుపొందాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -