Tuesday, July 7, 2026
E-PAPER
Homeజాతీయంకాశ్మీర్‌ దోడాలో వరద బీభత్సం..

కాశ్మీర్‌ దోడాలో వరద బీభత్సం..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: జమ్మూ కాశ్మీర్‌లోని దోడా జిల్లాలో వర్షాలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఎడతెరిపి లేకుండా కురిసిన వానాలకు వరదలతో పాటు పెద్ద మొత్తంలో బురదతో కూడిన వరద ఇండ్లలపై పడింది. దీంతో థాథ్రి ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో బురదలోఅనేక ఇళ్లు, దుకాణాలు, వాహనాలు శిథిలాల కింద కూరుకుపోయాయి. మంగళవారం కాస్తా వరద తగ్గడంతో ఆ ప్రాంతంలోని స్థానికులు ఉదయాన్నే దెబ్బతిన్న భవనాలను, ధ్వంసమైన వాహనాలను గమనించారు. రోడ్డుపై పడిన రాళ్లు, శిథిలాల కింద అనేక వస్తువులు పడి ఉన్నాయి. రాళ్లు కార్లపై పడటం, అనేక వాహనాలు బురద నేలలో కూరుకుపోయినాయి. ప్రస్తుతానికి ఈ కొండచరియల విరిగిపడే ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -