నవతెలంగాణ ఆర్మూర్
సెంట్రల్ లేబర్ కమిషనరేట్ హైదరాబాద్ ఆఫీస్ వద్ద ఐఎఫ్టియు ఆధ్వర్యంలో కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ఐఎఫ్టియు ఆల్ ఇండియా ఉపాధ్యక్షులు బి ప్రదీప్, ఎస్ వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి టి శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు భూమన్న, జనార్దన్లు మాట్లాడినారు. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోట్ల వల్ల కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులు కోల్పోవాల్సి వస్తుందని వారు తెలిపారు. ఎనిమిది గంటల పని స్థానంలో 12 గంటల పని, సమ్మె చేసే హక్కు హరించడం, సమాన పనికి సమాన వేతన తీర్పును నిర్లక్ష్యం చేయడం, ఉపాధి భద్రత కోల్పోవడం జరుగుతుందని వారు తెలిపారు. యూనియన్ పెట్టుకునే హక్కు నిర్వీర్యం చేయబడుతుందని, కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాన్ని కాపాడే విధంగా లేబర్ కోడ్లలు ఉన్నాయని వారు అన్నారు. నరేంద్ర మోడీ ఎన్నికల వాగ్దానాలను విస్మరించి, కార్మిక వ్యతిరేక రైతు వ్యతిరేక విధానాలు ఆలోచిస్తున్నారని వారు అన్నారు.
ఈ ధర్మాలో నిజామాబాద్ జిల్లా ఐఎఫ్టియు ప్రధాన కార్యదర్శి దాసు, ఉపాధ్యక్షులు శివాజీ, సహాయ కార్యదర్శి శివకుమార్,జేపీ గంగాధర్, జిల్లా నాయకులు మోహన్, భారతి, తెలంగాణ ఆదర్శ గ్రామపంచాయతీ, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు నరసయ్య, హోసన్న, నర్సంపల్లి గంగారాం, అమృతపూర్ లక్ష్మణ్, తెలంగాణ ప్రగతిశీల భీడి వర్కర్స్ యూనియన్ నాయకులు లక్ష్మీ, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.



