Monday, September 22, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంనేపాల్‌ నుంచి చైనాకు ప్రత్యక్ష విమాన సర్వీసులు

నేపాల్‌ నుంచి చైనాకు ప్రత్యక్ష విమాన సర్వీసులు

- Advertisement -

ఖాట్మండు : నేపాల్‌ నుంచి చైనాకు ప్రత్యక్ష విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్లు నేపాల్‌ ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. నేపాల్‌ రాజధాని ఖాట్మండు నుండి చైనాలోని గ్వాంగ్‌జౌకు గురువారం నుంచి ప్రత్యక్ష విమానాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. మొదటిసారిగా ఖాట్మండు- గ్వాంగ్‌జౌ-ఖాట్మండు విమానసర్వీసు కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్లు నేపాల్‌ ఎయిర్‌లైన్స్‌ కార్పోరేషన్‌ (ఎన్‌ఎజి) ప్రతినిధి మనోజ్‌కుమార్‌షా తెలిపారు. ఈ లైన్‌లో వారానికిమూడు విమానాలు తిరుగుతాయని అన్నారు. మొదటి విమాన సర్వీసు గురువారం, రెండవది సెప్టెంబర్‌ 28 షెడ్యూల్‌ చేయబడ్డాయని అన్నారు. ఆ తర్వాత, ప్రతి ఆది, మంగళ, శనివారాల్లో గ్వాంగ్‌జౌకు సర్వీసులు ఉంటాయని ఆయన వివరించారు. ఈ సర్వీసుల ప్రారంభంతో నేపాల్‌ జాతీయ ఎయిర్‌లైన్‌ సంస్థ ఇప్పుడు తొమ్మిది దేశాలకు విమాన సర్వీసులను నడుపుతోందని ఎన్‌ఎసి తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -