– ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ కేంద్ర కమిటీ సభ్యులు కల్లూరి మల్లేశం
నవతెలంగాణ -తుర్కపల్లి
ట్రాన్స్ పోర్ట్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, కార్మికులకు నష్టం చేసే నూతన మోటార్ వాహన చట్టం -2019ను రద్దు చేయాలని అల్ ఇండియా రోడ్ ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ కేంద్ర కమిటీ సభ్యులు కల్లూరి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గురువారం మండల కేంద్రంలో ఆ ఫెడరేషన్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఘనంగా నిర్వహించారు.ఈ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేరళ రాష్ట్రంలో జూన్1 ,1974న ఏఐఆర్టీబ్ల్యూఎఫ్ ఏర్పాటైందన్నారు.నాటి నుంచి ట్రాన్స్ పోర్ట్ కార్మికుల సమస్యలపైన నిరంతరం పోరాడుతున్న ఏకైక సంఘం అని తెలిపారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రాన్స్ పోర్ట్ కార్మికుల సమస్యలు మరింత పెరిగాయని వాహనాల ఖరీదు ను, ఇన్సూరెన్స్,ఫిట్ నెస్, రోడ్ టాక్సీ,రిజిస్ట్రేషన్ లాంటి అనేక ఖర్చులను విపరీతంగా పెంచిందని తెలిపారు. మూలిగే నక్క పై తాటి పండు పడ్డట్టు ట్రాన్స్ పోర్ట్ కార్మికుల పై నూతన మోటార్ వాహన చట్టం -2019 ని తీసుకువచ్చి ప్రమాదాలను తగ్గించే పనికి బదులు డ్రైవర్స్‌ను కఠినంగా శిక్షించే విధంగా , లక్షల రూపాయలు ఫైన్ లను వేసే విధంగా చట్టం కేంద్రం తీసుకువచ్చిందన్నారు. దిన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఈ నెల1 నుండి 30 వరకు ఘనంగా నిర్వహించాలని ,క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, జాతాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జెండాను ట్రాన్స్ పోర్ట్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు గుండెబోయిన బలరాం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీసభ్యులు పోతారాజ్ జహంగీర్,మండల కన్వీనర్ తూటీ వెంకటేశం , ట్రాన్స్ పోర్ట్ యూనియన్ నాయకులు గుండెబోయిన రమేష్ పల్లపు కనకయ్య కృష్ణమూర్తి గణేష్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.