అంగరంగ వైభవంగా మంత్రి జగదీష్ రెడ్డి  జన్మదిన వేడుకలు..

నవతెలంగాణ చివ్వేంల: మండలంలోని చివ్వేంల, అక్కలదేవిగూడెం, పాండ్యనాయక్ తండ, రాజు తండ, మోదిన్ పురం, తిమ్మాపురం, వల్లబాపురం, ఉండ్రుగొండ, తిరుమలగిరి, తుల్జారావు పేట, చందుపట్ల, మున్యా నాయక్ తండ, ఎంజి నగర్ తండ, సేవాలాల్ తండ, తో పాటు వివిధ గ్రామపంచాయతీలలో స్థానిక సర్పంచ్, బీఆర్ఎస్ గ్రామ కమిటి ఆధ్వర్యంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. తదనంతరం మంత్రి జగదీష్ రెడ్డి  నామకరణంతో జిజేఆర్ కప్ క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులకు విజేతలకు పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసి భూక్య సంజీవ్ నాయక్, ఎంపీపీ ధరావత్ కుమారి బాబు నాయక్, సర్పంచుల  ఫోరం  మండల అధ్యక్షుడు  జూలకంటి కంటి సుధాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ రౌతు నరసింహారావు, బీఆర్ఎస్ యువజన విభాగం
మండలాధ్యక్షుడు పుట్ట గురువేందర్, సర్పంచులు బిక్షం నాయక్, బద్రు నాయక్, జీడిమెట్ల నాగలక్ష్మి, లక్ష్మయ్య, పల్లేటి నాగయ్య శైలజ, దొంగరి కోటేశ్వరరావు,కంచర్ల నిర్మల గోవిందరెడ్డి, జాల మానస జయరాం,భూక్య రాజ్యలక్ష్మి నాగునాయక్, బోయిల కృష్ణ, ఎంపిటిసి సుశీల సాగర్, మిర్యాల గోవిందరెడ్డి, పార్వతమ్మ, ఎంపిటిసిలు, ఉప సర్పంచ్లు, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love