నవతెలంగాణ- చివ్వేంల: గ్రామపంచాయతీ కార్మికుల రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా శుక్రవారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి వినతి పత్రం అందజేసి వారు మాట్లాడుతూ ప్రభుత్వం మా డిమాండ్లను నెరవేర్చంతవరకు సమ్మె విరమించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్మికులు సాగర్, రాంబాబు, శంకర్, రవి, రాణీ ,ఉప్పలయ్య, శ్రీను, రేణుక, బిక్షం, కృష్ణ, మోహన్, సురేష్, నాగ, మంగ్య తదితరులు పాల్గొన్నారు.