చైనీస్ తైపీ చేతిలో 3-1తో ఓటమి
ఎఎఫ్‌సి మహిళల ఆసియాకప్
సిడ్నీ: ఎఎఫ్‌సి మహిళల ఆసియాకప్ ఫుట్‌బాల్ టోర్నీలో భారతజట్టు నిర్ణయాత్మక మ్యాచ్‌లో ఓటమిపాలైంది. మంగళవారం జరిగిన గ్రూప్-సి లీగ్ మ్యాచ్‌లో భారత మహిళలజట్టు 1-3తో పరాజయాన్ని చవిచూసింది. సిడ్నీ స్టేడియంలో ఈ మ్యాచ్‌లో 12వ ని.లో యు-యుషన్ 12వ ని.లో ఒక గోల్ కొట్టి చైనీస్ తైపీని 1-0 ఆధిక్యతలో నిలిపింది. ఆ తర్వాత భారత్ తరఫున కళ్యాణ్ 39వ ని.లో ఒక గోల్ చేయడంలో స్కోర్ 1-1తో సమమైంది. తొలి అర్ధభాగం అదనపు సమయంలో చైనీస్ తైపీ తరఫున హి-హుయాన్ ఒక గోల్ చేయడంలో తైపీ జట్టు 2-1 ఆధిక్యతలో నిలిచింది. దీంతో తొలి అర్ధభాగం ముగిసేసరికి చైనీస్ తైపీ జట్టు 2-1 ఆధిక్యతలో నిలువగా.. 77వ ని.లో యు-టింగ్ మరో గోల్ చేయడంలో తైపీ జట్టు 3-1 ఆధిక్యతలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత భారతజట్టులో రెండు మార్పులు చేసినా ప్రయోజనం లేదు.
ఫుట్‌బాల్‌లో భారత్‌కు నిరాశ
- Advertisement -
- Advertisement -



