- Advertisement -
పర్యావరణ హితం.. ప్రభుత్వ అభిమతం
నవతెలంగాణ- మద్నూర్
రాష్ట్ర ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు సన్న బియ్యంతో పాటు జానపనారా చేతి సంచులు పంపిణి చేయడం సంతోషకరమని మద్నూర్ మండల కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఒక్క రేషన్ కార్డుపై ఒకటి మాత్రమే పంపిణి చేయనున్నారు. 25 కిలోల వరకు బియ్యం తీసుకొని వెళ్లే విధంగా వీటిని రూపొందిచారని పంపిణీలో కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. లబ్ధిదారులకు ఇచ్చే సన్నబియ్యంతో పాటు పర్యావరణహిత సంచులు అందిచడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమం గ్రామ పెద్దలు, గ్రామ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఈరన్న, యూవ నాయకులు కొండవార్ సుభాష్, హన్మగౌడ్, గ్రామనాయకులు గ్రామస్తులు రేషన్ వినియోగదారులు పాల్గొన్నారు.
- Advertisement -



