- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద కుటుంబాల ఆడబిడ్డల పెళ్లిళ్లకు అందించే కళ్యాణ లక్ష్మి పథకం చెక్కులు మంజూరైన లబ్ధిదారుల కుటుంబాలకు మండలంలోని పెద్ద ఎక్లారా గ్రామ సర్పంచ్ మహేష్ కుమార్ ఆ గ్రామ పెద్దలు హనుమంతరావు దేశాయ్ పలువురు గ్రామ పెద్దలు కలిసి లబ్ధిదారులకు ఆదివారం మద్నూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మహేష్ కుమార్ మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా నిరుపేద కుటుంబాల ఆడబిడ్డల పెళ్లిలకు కళ్యాణ లక్ష్మి పథకం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రభుత్వం ఈ పథకం ద్వారా ఒక లక్ష 116 రూపాయలు అందించడం లబ్ధిదారులంతా ప్రభుత్వానికి అభినందిస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నారని అన్నారు.
- Advertisement -



