Sunday, July 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ లు నోటుపుస్తకాలు పంపిణి 

విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ లు నోటుపుస్తకాలు పంపిణి 

- Advertisement -

నవతెలంగాణ వలిగొండ రూరల్

 మండలంలోని గోకారం, వర్కట్ పల్లి, సంగెo, నేలపట్ల ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు గోకారంలోని చెర్క జగన్నాధం మెమోరియల్ ట్రస్ట్ సౌజన్యంతో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, నోటుపుస్తకాలు శనివారం పంపిణి చేశారు. ఈ సందర్భముగా ట్రస్ట్ ఛైర్మెన్ పబ్బు నారాయణ మాట్లాడుతూ జగన్నాధం గ్రామ సర్పంచుగా పేద ప్రజలకు ఎంతో సేవ చేశారని, ఆయన జ్ఞాపకార్థం ట్రస్ట్ ఏర్పాటుచేశామని, ట్రస్ట్ ద్వారా 3 సంవత్సరాలుగా విద్యార్థులకు అవసరం అయ్యే బ్యాగులు, నోటుపుస్తకాలు అందజేస్తున్నామని అన్నారు. శనివారం  ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 400 మంది విద్యార్థులకు పంపిణి చేశామని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత చదువులు చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు తుర్కపెల్లి సురేందర్, నారి రామస్వామి, కవిడే సురేష్, పబ్బు యాదగిరి, మల్లేశం, పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -