నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని ప్రభుత్వ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు గ్రామానికి చెందిన రాచర్ల అరవింద్ స్కూల్ బ్యాగులను వితరణ చేశారు. ఈ మేరకు శుక్రవారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాఠశాలలో ఆర్థికంగా వెనుకబడిన 20 మంది విద్యార్థులకు దాత రాచర్ల అరవింద్ స్కూల్ బ్యాగులను అందజేశారు. ఈ సందర్భంగా దాత అరవింద్ మాట్లాడుతూ విద్యార్థులందరూ క్రమం తప్పకుండా బడికి హాజరు కావాలని, క్రమశిక్షణతో ఉంటే జీవితంలో పైకి రావొచ్చని సూచించారు.
స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సుమారు రూ.8వేల విలువైన స్కూల్ బ్యాగులను వితరణ చేసిన దాత అరవింద్ ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆదినాగలక్ష్మీ అభినందించారు. పాఠశాల విద్యార్థుల తరఫున శాలువాతో సత్కరించి, కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజేశ్వర్, చంద్రశేఖర్, శ్యామల, మధుశేఖర్, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.



