Magazines

పామాయిల్ కర్మాగారంలో రేపటి నుంచి మరమ్మతులు

1 గంట క్రితం

palm oil factory
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 11, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - అశ్వారావుపేట

అశ్వారావుపేట పామాయిల్‌ కర్మాగారంలో వార్షిక మరమ్మతుల నేపథ్యంలో సోమవారం (అక్టోబర్‌ 12) నుంచి క్రషింగ్‌ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆయిల్ ఫెడ్ ఆదివారం ప్రకటించింది. గత కొద్ది రోజులుగా పామాయిల్‌ గెలల దిగుమతి తగ్గిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.


ఈ క్రమంలో రైతులు తమ పామాయిల్‌ గెలలను అప్పారావుపేట కర్మాగారానికి తరలించాలని యాజమాన్యం సూచించింది.అక్కడ గెలల దిగుమతి యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. అశ్వారావుపేట కర్మాగారంలో మాత్రం రెండు టన్నుల లోపు సామర్థ్యం గల చిన్న వాహనాలకు మాత్రమే గెలల అన్‌లోడింగ్‌ సౌకర్యం కల్పించనున్నట్లు వెల్లడించింది. రైతులు ఈ మార్పులను గమనించి సహకరించాలని ప్లాంట్స్‌ అండ్‌ ప్రాజెక్ట్స్‌ మేనేజర్‌ శ్రీకాంత్ రెడ్డి, అప్పారావుపేట, అశ్వారావుపేట ఫ్యాక్టరీ మేనేజర్‌ లు నాగబాబు, కార్తీక్ ,కొత్తగూడెం డివిజనల్‌ ఆఫీసర్‌ సబావత్ శంకర్ సంయుక్తంగా కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్