Magazines

పొట్ట దశకు ముందు వరికి పొటాష్‌ తప్పనిసరి

1 గంట క్రితం

Potash
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 08, 2026 | 1 నిమిషాల చదవడం

- పంటలను పరిశీలించిన మండల వ్యవసాయ అధికారి ఆర్. నరేష్.

నవతెలంగాణ - రాయపోల్‌

వరి పంట పొట్ట దశకు ముందు తప్పనిసరిగా పోటోస్ మందును వాడాలని, పొటాష్ వినియోగించడం వలన గింజ నిండుగా వస్తుందని మండల వ్యవసాయ అధికారి ఆర్. నరేష్ అన్నారు. గురువారం రాయపోల్‌ మండలంలో చిన్నమాసాన్ పల్లి, ముంగిస్ పల్లి గ్రామాల్లో వరి, పత్తి పంటలను మండల వ్యవసాయ అధికారి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వరి పంట పొట్ట దశకు ముందు, కొన్ని పొలాల్లో పొట్ట దశలో ఉన్నట్లు గుర్తించారు.వరి పంటలో పొట్ట దశకు ముందు చివరిసారిగా యూరియాతో పాటు పొటాష్‌ ఎరువును తప్పనిసరిగా వేసుకోవాలని సూచించారు.


పొటాష్‌ వినియోగం వల్ల గింజ నిండుగా ఏర్పడటంతో పాటు తాలు తగ్గి, గింజ బరువు పెరుగుతుందని తెలిపారు. యూరియా, పొటాష్‌ వేసిన రెండు మూడు రోజుల తర్వాత కార్టాప్‌ హైడ్రోక్లోరైడ్‌ 50 శాతం ఎస్పీ 400 గ్రాములు ఎకరాకు, వేపనూనె 500 నుంచి 1000 మిల్లీలీటర్లు ఎకరాకు కలిపి పిచికారీ చేసుకోవాలని సూచించారు. దీంతో తెల్లకంకి, కాండం తొలుచు పురుగు నివారణకు ఉపయోగపడుతుందని తెలిపారు.


అలాగే ప్రస్తుతం పత్తి పంటలో వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు ఆరుబడుతున్న చోట్ల 13:0:45 ఎకరాకు ఒక కిలో లేదా నానో యూరియాను లీటరు నీటికి 2 నుంచి 3 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలని నరేష్‌ సూచించారు. దీనివల్ల కొంతమేర బెట్ట పరిస్థితులను పంట తట్టుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.రైతులు వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ పంటలపై ఎప్పటికప్పుడు పరిశీలన కొనసాగించాలని కోరారు.ఈ కార్యక్రమంలో చిన్నమాసాన్ పల్లి సర్పంచ్‌ నర్సింహారెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఇక్బాల్‌, రైతులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్