Magazines

బ్యాడ్మింటన్ పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో సంగారెడ్డి జిల్లాకు బంగారు, కాంస్య పతకాలు

8 గంటల క్రితం

medals
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 03, 2026 | 1 నిమిషాల చదవడం

పతకాలు సాధించిన పోలీసు సిబ్బందిని శాలువాతో సత్కరించి అభినందించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

 నవతెలంగాణ-సంగారెడ్డి 

తెలంగాణ పోలీస్ అకాడమీ, హైదరాబాద్‌లో నిర్వహించిన 5వ తెలంగాణ బ్యాడ్మింటన్ పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో సంగారెడ్డి జిల్లా పోలీసు సిబ్బంది ప్రతిభ కనబరిచారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన హెడ్ కానిస్టేబుల్ ఈ.డి. సజీవ్ 50+ వయస్సు విభాగంలో బంగారు పతకం సాధించగా, మహిళల ఓపెన్ డబుల్స్ విభాగంలో శ్రావ్య, ధరణిలు కాంస్య పతకం సాధించారు.


ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్, పతకాలు సాధించిన హెడ్ కానిస్టేబుల్ ఈ.డి. సజీవ్, శ్రావ్య, ధరణిలను శాలువాతో సత్కరించి అభినందించారు. క్రీడల్లో ప్రతిభ కనబరచి సంగారెడ్డి జిల్లా పోలీసు శాఖకు గౌరవం తీసుకురావడం అభినందనీయమని అన్నారు. పోలీసు సిబ్బంది విధి నిర్వహణతో పాటు క్రీడల్లోనూ ప్రతిభను చాటుతూ జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఎస్పీ ఆకాంక్షించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించేలా క్రీడాకారులను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, ఏఆర్ డిఎస్పీ నరేందర్ ఉన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్