Magazines

సిజేరియన్‌ ‌తర్వాత...

1 గంట క్రితం

Caesarean
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 25, 2026 | 2 నిమిషాల చదవడం

సాధారణంగా మహిళలు గర్భం దాల్చినప్పటి నుంచి పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకుంటూ ఎన్నో కలలుకంటుంటారు. ఇదంతా ఒక ఎత్తైతే ప్రసవం మరో ఎత్తు. ఎందుకంటే బిడ్డకు జన్మనివ్వడం అనేది పునర్జన్మ అని చెప్పవచ్చు. అయితే ఆ కష్టం లేకుండా ప్రస్తుత రోజుల్లో సిజేరియన్ డెలివరీలు కామన్​ అయ్యాయి. కానీ సిజేరియన్ కూడా మహిళకు అంత సులువు కాదు. ఎందుకంటే సర్జరీ తర్వాత శరీరం సాధారణ స్థితికి రావడానికి మహిళలు ఎంతగానో కష్టపడాలి. అయితే డెలివరీ తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సీజేరియన్​ నొప్పుల నుంచి ఉపశమనం పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం...

విశ్రాంతి: ఆపరేషన్​ జరిగిన తర్వాత తల్లులు ఎంత విశ్రాంతి తీసుకుంటే అంత త్వరగా కోలుకోవచ్చు. ఎందుకంటే కుట్లపై ఒత్తిడి పడకుండా అవి త్వరగా మానిపోవడానికి ఇది దోహదం చేస్తుంది. అయితే ప్రసవించిన తొలినాళ్లలో చాలా సమయం పాపాయితోనే సరిపోతుంది. వారికి పాలివ్వడం, డైపర్లు/దుస్తులు మార్చడం, నిద్రపుచ్చడం వంటి పనుల కారణంగా రోజంతా బిజీబిజీగా గడిచిపోతుంది. దీంతో విశ్రాంతికి సమయం దొరకదు. అయితే ఇది ఇటు బాలింతలకు, అటు శిశువుకు.. ఇద్దరికీ మంచిది కాదు. కాబట్టి తల్లైన తొలినాళ్లలో నిద్రలేమిని, ఒత్తిడిని జయించాలంటే ఇతర పనులు పక్కన పెట్టి బుజ్జాయి పడుకున్నప్పుడే తల్లులు కూడా నిద్రకు ఉపక్రమించాలి.

పాలిస్తే: పాలిచ్చే ప్రక్రియ కొత్తగా తల్లైన మహిళలకు ఎంతో ప్రయోజనకరం. ప్రసవానంతరం పెరిగిన బరువు తగ్గడానికి, వెంటనే మళ్లీ గర్భం ధరించకుండా ఉండడానికి.. ఇది ఎంతో మేలు చేస్తుంది. అయితే పిల్లలకు పాలిచ్చేటపుడు తల్లులు కూర్చునే పొజిషన్‌ కూడా కీలకమే. ముందుకి, వెనక్కి వంగిపోకుండా నిటారుగా కూర్చొని చిన్నారికి పాలివ్వాలి. ఇలా చేయడం వల్ల సిజేరియన్‌ కారణంగా దీర్ఘకాలంలో నడుంనొప్పి రాకుండా జాగ్రత్తపడొచ్చు. ఇక తల్లులకు, చిన్నారులకు సౌకర్యవంతంగా ఉండడం కోసం నిపుణుల సలహా మేరకు ఫీడింగ్‌ పిల్లోను కూడా వాడొచ్చు.

పోషకాహారం: సిజేరియన్‌ తర్వాత ఇది తినకూడదు, అది తాగకూడదు.. అన్న రూల్స్​ చాలా ఇళ్లలో ఇప్పటికీ ఉంటుంటాయి. అయితే పాలిచ్చే తల్లులకు ఎలాంటి పథ్యాలు అవసరం లేదనే విషయాన్ని గమనించాలి. గర్భిణిగా ఉన్న సమయంలో సంపూర్ణ పోషకాలు లభించే పదార్థాలన్నీ ఎలాగైతే తీసుకుంటారో ప్రసవానంతరం కూడా వైద్యుల సలహాతో అలాగే తీసుకోవాలని, తద్వారా సిజేరియన్‌ నొప్పుల నుంచి సైతం త్వరగా కోలుకోవచ్చు. సిజేరియన్​ తర్వాత కొన్ని రోజుల పాటు బరువులు ఎత్తడం వంటివి చేయొద్దని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మొదటి రెండు వారాల పాటు ఎక్కువ బరువున్న దేనినీ ఎత్తవద్దని వెల్లడిస్తున్నారు. అలాగే వైద్యులు సూచించిన మందులను నిర్దేశిత సమయం వరకు క్రమం తప్పకుండా వాడాలి. పాలిచ్చే తల్లులు కాబట్టి సొంతంగా ఎలాంటి మందులు వేసుకోకూడదు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్