- యథావిధిగా అక్రమ ఇసుక రవాణ
- పట్టించుకొని అధికార యంత్రాంగం
నవతెలంగాణ - బెజ్జంకి
మండల పరిధిలోని గాగీళ్లపూర్ గ్రామ శివారులోని మోయతుమ్మెద వాగు నుంచి పట్టపగలు జిల్లా కేంద్రానికి జరుగుతున్న అక్రమ ఇసుక దందాలో వాటా(అ)ధికారులున్నట్టు పలువురు ఇసుక రవాణదారులు ఆదివారం ఆరోపించారు.గ్రామంలోని కొందరు ఇసుక రవాణదారులు ముఠా సభ్యులుగా ఏర్పడి అధికారుల అండతోనే కొద్ది నెలలుగా యథేచ్ఛగా పట్టపగలు జిల్లా కేంద్రానికి అక్రమ ఇసుక దందా సాగిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.
మాముళ్లు ముట్టజెప్పుతూ మండలేతర ప్రాంతాలకు అక్రమంగా ఇసుక తరలుతున్న అక్రమ ఇసుక దందా ముఠా సభ్యులపై చర్యలు చేపట్టకపోవడంతో అక్రమ దందాకు అండగా నిలుబడుతున్నారనే విమర్శలను రెవెన్యూ, పోలీస్ శాఖాధికారులు రవాణదారుల్లో మూటగట్టకున్నారు. ఇప్పటికైనా విమర్శలకు తావివ్వకుండా అధికార యంత్రాంగం అక్రమ ఇసుక దందాకు చెక్ పెట్టి చిత్తశుద్ధిని చాటుకోవాల్సినా అవశ్యకత ఉంది.
యథేచ్ఛగా బైండోవర్ ఉల్లంఘనలు..
గతంలో అక్రమ ఇసుక రవాణలో పట్టుబడిన పలువురి ఇసుక రవాణదారులను అధికారులు చట్టపరమైన చర్యల్లో భాగంగా బైండోవర్ చేశారు. రవాణదారులు బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించి మళ్లీ యథేచ్ఛగా అక్రమ ఇసుక రవాణకు పాల్పడుతుండడం చట్టపరమైన చర్యలను సైతం లెక్కచేయకపోవడమేననే సంకేతాలను పరోక్షంగా అధికారులను హెచ్చరిస్తున్నట్టు రవాణదారులు చర్చించుకుంటున్నారు.
చర్యలు చేపడుతాం
నిబంధనలు వ్యతిరేకంగా వ్యవహరించి అక్రమ ఇసుక రవాణకు పాల్పడుతున్న రవాణదారులపై అధికారుల అధేశానుసారం చట్టపరమైన చర్యలు చేపడుతాం - సయ్యద్ సాధిక్ వసీం, ఎస్ఆర్ఓ గాగీళ్లపూర్






కామెంట్‌లు (0)