Magazines

విద్యార్థిని పరామర్శించిన ప్రభుత్వ విప్‌ బీర్ల

2 గంటల క్రితం

Beerla Ailaiah
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 05, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-ఆలేరు టౌన్ 

మిర్యాలగూడ పట్టణానికి చెందిన ఆవుల నరేందర్‌ నాగార్జునసాగర్‌ గురుకుల పాఠశాలలోని మూడో అంతస్తుపై నుంచి ప్రమాదవశాత్తూ పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే స్పందించిన పాఠశాల సిబ్బంది, బాలుడి కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సోమవారం ఎల్‌బీ నగర్‌లోని వెల్‌నాక్స్‌ రిహాబిలిటేషన్ సెంటర్‌కు వెళ్ళి పరామర్శించారు. ఈ క్రమంలో ఆయన బాదిత కుటంబసభ్యులకు ధైర్యం చెప్పారు. వైద్యులను అడిగి బాలుడి ఆరోగ్య వివరాలను తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసానిచ్చారు. తక్ష‍ణ సాయంగా రూ. 50వేలను కుటుంబ సభ్యులకు అందజేశారు. బాలుడు పూర్తిగా కోలుకునేవరకు తనవంతు సాయం అందిస్తానని భరోసానిచ్చారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్